Advertisement

గౌరవ డాక్టరేట్ పొందిన కరాటే మాస్టర్ తాండ్రోతు వీర వెంకటరమణ

జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : జగ్గంపేటకు చెందిన కరాటే మాస్టర్ ది ఫిట్నెస్ జిమ్ అధినేత తాండ్రోతు వీర వెంకటరమణకు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. 1986 నుండి కరాటే మాస్టర్ గా సేవలందిస్తూ గవర్నమెంట్ హై స్కూల్ నుండి అన్ని స్కూళ్లలో నేర్పిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి లో కరాటి పోటీల్లో స్టూడెంట్స్ కొన్ని వేల మెడల్స్ సాధించే విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. 2017 నుండి ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తూ వస్తున్నారు. 2001లో జిమ్ కోచ్ గా పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ కోచింగ్ ఇస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులను పంపిస్తున్నారు. 2004 నుండి జూడో ఒలంపిక్ గేమ్ కోచింగ్ ఇస్తూ జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ప్రతి సంవత్సరం 100కు మంది పైగా జూడో పోటీల్లో కోచింగ్ ఇచ్చి స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు. వారు ఎన్నో మెడల్స్ సాధిస్తూ రాష్ట్రంలో ఛాంపియన్షిప్ మన జిల్లాకు రావడమే మనకు గర్వకారణం ఆంధ్ర యూనివర్సిటీలో జూడో బోర్డ్ నెంబర్ గా సేవలందిస్తూ జేఎన్టీయూ యూనివర్సిటీ బోర్డ్ జూడో నెంబర్ గా నన్నయ యూనివర్సిటీ జూడో బోర్డు నెంబర్ గా స్పోర్ట్స్, ఫిట్నెస్ కోచింగ్ తీసుకున్న 100 మందికి పైగా ఈయన విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా కరాటే ,జూడో ,వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఉచితంగా నేర్పించి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దిన ఆయన ఇప్పటికీ ఎంతమంది వచ్చినా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వీర వెంకటరమణ తెలియజేస్తున్నారు. ఆయనకు గౌరవ డాక్టరేట్ రావడంతో ఆయన ఎన్నాళ్లు చేస్తున్న సేవలకు సరైన గౌరవం దక్కిందని ఆయన సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *