జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : స్థానిక జేవియర్ సెంటర్ లోగల రాయల్ ఇన్ ఫీల్డ్ షోరూమ్ పక్కన నూతన వ్యాపార సంస్థ శ్రీవల్లి కార్తికేయ ఆటో కన్సల్టెన్సీ షోరూమ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై షోరూమ్ ప్రారంభించారు. విశిష్ట అతిథిలుగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, మాజీ మంత్రి తోట నరసింహం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవల్లి కార్తికేయ ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం మరింత అభివృద్ధి పథంలో నడిచి వీరికి లాభాల పంట పండాలని వారు ఆశీర్వదించారు. ఈసందర్భంగా యజమానులు మాట్లాడుతూ శ్రీవల్లి కార్తికే ఆటో కన్సల్టెన్సీలో సెకండ్ హ్యాండ్ అన్ని రకాల బైకులు, అన్ని రకాల కార్లు సరసమైన ధరలకే లభిస్తాయని, స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జగ్గంపేట ఏరియా మెకానిక్ సోదరులుపాల్గొన్నారు.
శ్రీవల్లి కార్తికేయ ఆటో కన్సల్టెన్సీ నూతన వ్యాపార ప్రారంభ సంస్థను ప్రారంభించిన జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్

















Leave a Reply