ఉమ్మడి మెదక్ జిల్లా, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : రేగోడుమండల కేంద్రంలోని బ్రహ్మంగారిమఠం ఆవరణలో కాలభైరవ స్వామి జయంతి పురస్కరించుకొని కాలభైరవ స్వామి విగ్రహానికి పంచామృతలతో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో కాలభైరవ స్వామికి జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలభైరవ స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పూజారి శివ కుమార్, బ్రహ్మంగారి కమిటీ సభ్యులు పూర్ణచందర్, శివాజీ పాటిల్, గొల్ల వీరేశం, వడ్డేపల్లి శివ, ఆవుసలి చేన్నప్ప, వడ్ల సత్యం, ముప్పారం ఆంజనేయులు, ఆవుసలి రమేష్, శంకరంపేట విజయ్, వనపర్తి శ్రీనివాస్, దత్తు, బ్రహ్మంగారి శిష్య బృందం గడిల నర్సింలు, కురుమ మల్లయ్య, జేజమ్మల రామా గౌడ్, పోయిన లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాలభైరవ జయంతి














Leave a Reply