Advertisement

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

ఆలమూరు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : మండలంలోని గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. వృద్ధులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా వంద మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *