– జాతర సమయంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దుకాణాలు నడపాలి అని గ్రామసభ తీర్మానం
వెంకటాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 15 : తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీలో కార్యదర్శి శ్వేత, పేసా మొబైలిజర్ గొంది రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఘనంగా జరుపుకున్నారు. బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు పోవాలి అని తీర్మానం చేసుకున్నారు. అనంతరం గ్రామసభలో మేడారం జాతరకు ఊరట్టం ప్రాంతంలో నిర్వహించే బెల్లం దుకాణం, కొబ్బరి దుకాణాలు, కోళ్ల దుకాణాలు, మద్యం దుకాణంలు మొత్తం గ్రామపంచాయతీకే ఇవ్వాలి అని తీర్మానం చేసి, కలెక్టర్ కు పంపించండం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చేర్ప వెంకట నర్సయ్య, కోటే రామయ్య, చేర్ప రవీందర్, గొంది సాంబశివరావు, పాయం నాగరాజు, చర్ప చంద్రశేఖర్, చర్ప వీరమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply