Advertisement

నవీన్ యాదవ్ గెలుపు – రాష్ట్రంలో బీసీ రాజకీయాలకు మలుపు

– తెలంగాణలో బీసీల రాజకీయ ప్రభంజనం మొదలైంది

– ఇక నుండి గెలుపు గుర్రాలు బీసీలే

– బీసీలకు టికెట్ ఇవ్వనందుకే బీఆర్ఎస్ ఓటమి

– బీసీ రిజర్వేషన్ల చట్టానికి బీజేపీ ఆమోదం తెలుపకపోతే భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ఫలితాలే

– బీసీలకు టికెట్ ఇచ్చినందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది

– జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై సింహగర్జన సంపాదకుడు డా సునీల్ కుమార్ కామెంట్స్

– బీసీ రిజర్వేషన్లను పెంచకుండా అన్యాయం చేసినందుకే బీజేపీకి డిపాజిట్ గల్లంతు

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 15 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ అఖండ మెజార్టీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఇది బీసీల గెలుపుగా తాము భావిస్తున్నామని బీసీ నాయకుడు, విశ్వబ్రాహ్మణ యువ నాయకుడు, సింహగర్జన తెలుగు ఈ దిన పత్రిక సంపాదకుడు డా సునీల్ కుమార్ యాండ్ర అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలవడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రభంజనం ప్రారంభమైందని, నవీన్ యాదవ్ గెలుపు బీసీల రాజకీయాలకు మలుపు అని ఆయన అన్నారు. గతంలో బీసీలకు బీఫామ్ లు ఇస్తే ఓడిపోతారని, అగ్రకులాలకు టికెట్లు ఇస్తే గెలుస్తారని, ప్రతి ఎన్నికలలో గెలుపు గుర్రాలు అగ్రకులాలే అంటూ అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి వారికి టికెట్లు ఇచ్చేవారని, ఇక నుండి గెలుపు గుర్రాలు బీసీలేనని, నవీన్ యాదవ్ గెలుపు ద్వారా రుజువైందన్నారు.

ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ జరిగితే ఇద్దరు అగ్రకులాలతో పోరాడి ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఆమోదించాలని బీసీలు మొరపెట్టుకున్న బీసీల ఆకాంక్షలను గౌరవించని బీజేపీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని, అలాగే బీసీకి టికెట్ కూడా ఇవ్వకుండా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారానే బీజేపీకి బీసీలు, జూబ్లీహిల్స్ ఎన్నికను వేదికగా చేసుకుని బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తూ.. బీసీలకు టికెట్ ఇవ్వకుండా మరొకసారి అగ్రకులాలకు టికెట్ ఇవ్వడం వలన గెలవాల్సిన సిట్టింగ్ సీటు ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం మూలంగానే గెలిచిందని, గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇవ్వకుండా అగ్రకులానికి చెందిన నరేందర్ రెడ్డికి ఇవ్వడం మూలంగా ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు.

ఏది ఏమైనప్పటికి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని ఇకనైనా మెజార్టీ ప్రజలైన బీసీలకు, ఇక నుండి జరిగే ఏ ఎన్నికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలని, లేకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టిన గతే బీసీ వ్యతిరేక పార్టీలకు పడుతుందని ఆయన హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నవీన్ యాదవ్ కు, బీసీ బిడ్డకు అండగా నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలకు డా సునీల్ కుమార్ యాండ్ర అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *