మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 16 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో తోట త్రిమూర్తులు ఆదేశంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ఏడిద సీతానగరం రోడ్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం వల్ల పేదలకు మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని, వారు వైద్య విద్య వైద్యానికి దూరమవుతారని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కురుపుడు భవాని రాంబాబు, వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్, రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి అర్జున్, ఎంపీటీసీ పట్టణా నాగబాబు, తాతపూడి ఉష రాజేష్, నాయకులు పితాని నారాయణరావు, విసుప్పు రెడ్డి, శివ కొండేటి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏడిద సీతానగరం రోడ్డులో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం
















Leave a Reply