హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 16 : సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పమ్ వెబ్సైట్లను బ్లాక్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ సైట్లు పూర్తిగా అందుబాటులో లేకుండా చేశారు. ఐబొమ్మ సైట్ ద్వారా 1ఎక్స్ బెట్ అనే ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ని నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాల కోసం వెతికే యూజర్లను బెట్టింగ్ వైపు మళ్ళించడం అతని టార్గెట్ అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి రవి భారీగా నిధులు స్వీకరించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఐబొమ్మ, బప్పమ్ సైట్లను బ్లాక్ చేసిన పోలీసులు
















Leave a Reply