- కాకినాడ నుండి 6 బస్సులు ఏర్పాటు
- పెద్దాపురం జట్ల లేబర్ యూనియన్ సమావేశం లో తాటిపాక మధు
పెద్దాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : సీపీఐ శత దినోత్సవం సందర్భంగా సీపీఐ వందేళ్ల పండుగ సభ ఖమ్మం పట్టణం లో జరగనుందని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా నుండి 6 బస్ లు ఏర్పాటులు చేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక పెద్దాపురం జామెయిల్ తోటలో పెద్దాపురం ఏఐటియుసి విస్తృతస్థాయి సమావేశం జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు వై.రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మ గౌరవం అనే అంశాలపై ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ శతాబ్ది వార్షికోత్సవ సందర్భంగా డిసెంబర్ 20 నుండి 26 వరకు ఆయా శాఖలలో జెండాల ఆవిష్కరణ చేయాలని, జిల్లా జాత నిర్వహించాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 26 న కేంద్ర కార్మిక, రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ఆందోళనకు పిలుపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు పాల్గొని నవంబర్ 26న జరిగే నిరసన ధర్నా జయప్రదం చేయాలని ఆయన అన్నారు. 44 ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్స్ కుదించడం వల్ల కార్మికుల నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉందని,కోడ్స్ అమలులోనే భాగంగానే పని గంటలు పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని, షాప్ అండ్ ఎక్స్టాబ్లేషన్ చట్టం అమల్లో భాగంగా 8 గంటల పని దినాలను 10 గంటలు పని దినాలు పెంచే జీవోలు తీసుకొస్తుందని ఆ జీవోలు రద్దు చేసే వరకు పోరాటాల నిర్వహించాలని ఆయన అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నవంబర్ చివరి వారంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం కాకినాడలో జరగనున్నదని, దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల సత్యనారాయణ, వెంకటరమణ, త్రిమూర్తులు, సూర్యనారాయణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply