Advertisement

అట్మాస్పియర్ కోర్‌కు రుషికొండ ప్యాలెస్ !?

విశాఖపట్నం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్నదానిపై జరుగుతున్న మేథోమథనంలో అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రజలు మాత్రం అత్యధికంగా దాన్ని టూరిజానికే ఉపయోగించాలని సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆ విలాసవంతమైన భవనాలను ఎలా ఉపయోగించుకోవచ్చన్నదానిపై టూరిజం కంపెనీలు అనేక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. నిజానికి ఆ భవనం దేనికీ పనికి రాదు. గతంలో వందకుపైగా గదులు ఉండే రిసార్టు ను కూల్చేసి.. ఐదు వందల కోట్లు పెట్టికేవలం పన్నెండు గదులు ఉండే భవనాలు కట్టారు. దీని వల్ల ఆదాయం కూడా రాదు.

అయితే పక్కన తొమ్మిది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. రిసార్టులాగా దాన్ని వాడుకోవండం ద్వారా మొత్తం వినియోగించుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాలు కాకుండా.. ఇతర మద్దతుల్లో నిర్మాణాలు చేసి.. కాటేజీలుగా మార్చి రిసార్టుగా మార్చాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్ధ హోటల్స్ నిర్వహణ సంస్థ అట్మాస్పియర్ కోర్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

మాల్దీవ్స్ సహా అనేక ప్రముఖ టూరిజం డెస్టినేషన్స్ లో హోటల్స్ ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇటీవల ఇండియాలో విపరీతంగా పెట్టుబడులు పెడుతోంది. విస్తరిస్తోంది. విశాఖలో ఓ మంచి ప్రాజెక్టు కోసం చూస్తోంది. రుషికొండ అయితే సరిపోతుందని భావిస్తోంది. అందుకే ప్రభుత్వ వర్గాలను సంప్రదించిందని.. దానిపై వర్కవుట్ జరుగుతోందని అంటున్నారు. దాన్ని అలా వృధా ఉంచడం కన్నా ఆదాయం సృష్టించుకోవడం చాలా ముఖ్యమన్న అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. అట్మాస్పియర్ కోర్ మంచి ఆఫర్ ఇస్తే…. వారికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *