కేరళ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు పెరుగుతున్న తరుణంలో నది స్నానం చేసేటప్పుడు భక్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ముక్కలోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని.. వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాదు.. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు తెలియజేశారు. అటు కేరళలో మొత్తం 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు చేశామని … ఇప్పటిదాకా 19 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
శబరిమలకు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!













Leave a Reply