నందిగామ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : సామాన్యుడి ప్రయాణం మృత్యుమార్గంగా మారుతోంది. నిరంతర బస్సు ప్రమాదాల పరంపర తెలుగు రాష్ట్రాల రహదారులపై బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఒక్క ఏపీ-తెలంగాణా జాతీయ రహదారుల మీదే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగానికి ప్రజల జీవితాలు బలి అవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
- లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో
ఎన్డీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నందిగామ బైపాస్ అనాససాగరం వద్ద ఫ్లై ఓవర్‌పై కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే నందిగామ ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు ఎడమ భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
















Leave a Reply