- కూకట్ పల్లి కాపు వనభోజన కార్యక్రమంలో బండారు శ్రీనివాస్
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : కాపు యువత అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కూకట్ పల్లిలో జరిగిన 39వ వనభోజన మహోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనసేన నాయకుడు పంచకర్ల సందీప్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాపులు మిగిలిన సామాజిక వర్గాల వారందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. పదేళ్ల క్రితం కూకట్ పల్లిలో ఇదే వనభోజనాలు భువన విజయం పేరుతో జరిగాయని, అప్పట్లో కేవలం 2వేల మంది మాత్రమే హాజరయ్యారని, నేడు అశేష సంఖ్యలో ఈ కార్యక్రమానికి కాపులు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో వంగవీటి మోహన రంగా రూపంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, కొన్ని దుష్టశక్తుల వల్ల ఆ అవకాశం చేజారిందని, ఈసారి మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న నాయకుడు వచ్చారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బండారు శ్రీనివాస్ ప్రసంగానికి ఆహుతుల నుంచి విశేష స్పందన లభించింది.
















Leave a Reply