Advertisement

అంగరంగ వైభవంగా జగ్గంపేట కాపు సంఘం వన సమారాధన మహోత్సవం

– హాజరైన ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వివిధ పార్టీల ప్రతినిధులు

– కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పది లక్షలు గ్రాంట్ ప్రకటన, జగ్గంపేట ఎమ్మెల్యే సొంత నిధులతో భోజనశాల, వంటగది, వాచ్ మ్యాన్ రూమ్ నిర్మాణం

జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : జగ్గంపేట కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీసాల చిన్నబాబు ఆధ్వర్యంలో కాపు వనభోజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట పరిసర ప్రాంతాల నుంచి 5000 మంది కాపు కుటుంబాల నుంచి హాజరై ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, తోట త్రిమూర్తులు, వరుపుల సుబ్బారావు, వంగా గీతా విశ్వనాథ్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, కాకినాడ మాజీ మేయర్ నాగిరెడ్డి చంద్రకళ దీప్తి, జగ్గంపేట జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, అరుణాచల మాధవి, కాపు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల కాపు నాయకులు హాజరై ముందుగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం చిన్నారుల కూచిపూడి నాట్యాలతో ఆహుతులను అలరించారు. అనంతరం అరుణాచల మాధవి తన ప్రవచనాలతో పరమశింపజేశారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ క్విజ్ పోటీల ద్వారా సేకరించిన లక్ష 14 వేల రూపాయలు కాపు సంక్షేమానికి ఉపయోగించాలని సంఘ అధ్యక్షుడు మీసాల చిన్నబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాపు సామాజిక భవనానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు గ్రాంటు అందిస్తానని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంతటి చక్కని కార్యక్రమాన్ని రూపొందించిన జగ్గంపేట కాపు సంక్షేమ సంఘాన్ని అభినందిస్తున్నానని అన్నారు. కాపు సామాజిక భవనానికి అన్ని రకాల ఫంక్షన్ లు నిర్వహించాలంటే భోజనశాల, వంటగది, వాచ్ మ్యాన్ రూము అవసరమని వీటిని తన సొంత నిధులతో తన తండ్రి జ్యోతుల నాగేశ్వరరావు పేరు మీదుగా తొందర్లోనే నిర్మాణం చేపడతానని అన్నారు. అదేవిధంగా 10 అతిధి రూములు, నిర్మించేందుకు దాతలు ముందుకు వస్తే వారి పేర్లు మీద నిర్మించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల మణి, తోట సునీత, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, జీను పెద్ద రాంబాబు, బండారు రాజా, మారిశెట్టి భద్రం, దవులూరి ఈశ్వరరావు, మారిశెట్టి రాధా, తోలేటి సూర్యనారాయణ, తులా నరసింహారావు, కురుమళ్ళ నాగేశ్వరరావు, రాయి సాయి, అంగజాల బ్రహ్మాజీరావు, మసకపల్లి భైరవస్వామి, పుర్రె సూరన్న, తోట బుచ్చిరాజు, సూరపరెడ్డి నరేష్, గేడ్డమూరి బాబ్జి, మారిశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *