జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కలకలం
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు తీసుకుని ఓటు వేయని వారిని గుర్తించి వెనక్కి తీసుకునే పనిలో పడ్డారు. పోలింగ్ శాతం 50% కూడా నమోదు కాకపోవడంతో నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఒక ఇంట్లో 18 ఓట్లకు డబ్బు తీసుకున్నప్పటికీ కేవలం 4 మంది మాత్రమే ఓటు వేశారని, అపార్ట్మెంట్లలో నివసించే వారు బైటికి రాలేదని బూత్ ఏజెంట్లు గుర్తించారు. దీనిపై డబ్బులు తిరిగి ఇవ్వాలని కాలనీ పెద్దలను, అపార్ట్మెంట్ వాసులను అడుగుతున్న వైనం చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లలో ఓటరు లిస్టు ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే ప్రక్రియను బూత్ ఏజెంట్లు, స్థానిక కార్యకర్తలు ప్రారంభించినట్లు సమాచారం.
















Leave a Reply