కాసుబాబు సహా ఎనిమిది మంది అరెస్ట్
అమలాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసును కోనసీమ జిల్లా పోలీసులు వేగంగా ఛేదించారు. ప్రధాన నిందితుడు గంగుమల్ల షన్ముఖేశ్వరరావు అలియాస్ కాసుబాబు, అతని కుమారుడు అడబాల శంకర్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ తనపై విమర్శలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహించిన కాసుబాబు, ప్రతిష్ఠ నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. అక్టోబర్ 25న రాత్రి వక్కలంక సమీపంలో కత్తితో దాడి చేసి చంపి, గోదావరిలో శవాన్ని పడేశారు. ఈ కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించిన డీఎస్పీ, సిఐలు, ఐటీ కోర్ టీమ్లను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. కేసులో మూడు కార్లు, బులెట్, స్కూటర్, కత్తి, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
















Leave a Reply