కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : స్థానిక రమణయ్యపేటలో కాకినాడ ఐడిఎ మరియు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రపంచ జెరియాట్రిక్ టూత్ డే సందర్భంగా వృద్ధులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల మాట్లాడుతూ “జెరియాట్రిక్ టూత్ డే అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 9న జరుపుకుంటారని, వృద్ధులలో దంత సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వయసుతో పాటు దంత ఆరోగ్యం కూడా కీలకమని, వృద్ధులలో నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, వయసుతో పాటు నోటి ఆరోగ్యం మొత్తం శ్రేయస్సుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, కాబట్టి ఈ రోజున దాని ప్రాముఖ్యతను గుర్తు చేయబడుతుందని, ఈ రోజు దీర్ఘకాలిక సంరక్షణలో నివసించే వృద్ధులకు నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన తీసుకురావడం మరియు వృద్ధుల జీవన నాణ్యతను పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. సీనియర్లలో నోటి ఆరోగ్యం, మొత్తం శరీర ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, సరైన నోటి సంరక్షణ లేకపోవడం వల్ల న్యుమోనియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని కొందరు నిపుణులు హెచ్చరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ప్రసాద్ నాయుడు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ ఐడిఎ మరియు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దంత వైద్య పరీక్షలు

















Leave a Reply