- ఎమ్మెల్యే వేగుళ్ళ హర్షం
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని మొత్తం 613 అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) ద్వారా సుమారు రూ.13,25,716 కోట్ల పెట్టుబడులను తీసుకురావడం కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు. ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 16,13,188 మందికి ఉపాధి అవకాశాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అని, అలాగే ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరుగెత్తి రావడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్ళీ ట్రాక్ పైకి వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు. ఇంధనం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు-వాణిజ్యం, ఏపీ సీఆర్డీఏ, మున్సిపల్ శాఖల పరిధిలో ఈ కీలక ఒప్పందాలు కుదిరాయని, అలాగే ఈ సదస్సు విజయవంతం కావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని అన్నారు . పెట్టుబడులు రావడమే కాదు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇందుకు ఎంతగానో సహకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
















Leave a Reply