భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్
కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన “సింహగర్జన”
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బస్టర్ కొట్టిoది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆది నుంచి ఆధిక్యతల కొనసాగిస్తూ చివరి రౌండ్ వరకు తన ఆధిక్యతను ప్రదర్శించాడు. మొదటి, రెండో రౌండ్లతో పాటు మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 6042 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి లెక్కింపు పూర్తయ్యే సరికి 24, 758 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్య ర్థి నవీన్ యాదవ్ కు 8911, బీఆర్ ఎస్ అభ్యర్థి సునీతకు 8864 ఓట్లు రాగా ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 ఓట్లు సాధించారు. మొదటి రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు మూడు వేల ఓట్ల లీడ్ వచ్చింది. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు సాధించి 1144 ఓట్ల ముందంజలో నిలిచింది. ఇదే రౌండ్లో బీఆర్ఎస్ కు 8,609 ఓట్లువచ్చాయి. మూడో రౌండ్లో నవీన్ యాదవ్, 3,100 ఓట్ల లీడ్ సాధించారు. ఆ క్రమంలో 8 రౌండ్ల లెక్కింపు ముగిసే సరికి 23,163 వేల మెజార్టీతో కొనసాగుతుండగా చివరి రౌండ్ వరకు వచ్చే సరికి 24, 758 గెలుపును స్వంతం చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఆది నుంచి తమ గెలుపు ఖాయంగా భావించిన కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఫలితాలతో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ క్యాడర్ గాంధీ భవన్ తో పాటు ఆయా ప్రాంతాల్లో సంబరాల్లో మునిగి తేలుతున్నాయి.
















Leave a Reply