న్యూయార్క్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్ కన్నుమూశారు. జేమ్స్ డి వాట్సన్ న్యూయార్క్‌లోని ఈస్ట్ నార్త్‌పోర్ట్‌లో గురువారం మరణించారు. జేమ్స్ వాట్సన్ మరణాన్ని ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ ధ్రువీకరించారు. ఇటీవల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను హాస్పిస్ కేర్‌కు తరలించగా, అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు. అయితే కేవలం 25 ఏళ్ల వయసులోనే, డీఎన్ఏ డబుల్ హీలిక్స్ నిర్మాణాన్ని కనుగొనడం ద్వారా ఆధునిక విజ్ఞానశాస్త్రంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన శాస్త్రవేత్తగా జేమ్స్ వాట్సన్ గుర్తింపు పొందారు. అయితే ఇందుకు సంబంధించి ఆయన నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో వివాదాలలో చిక్కుకోవడం, నోబెల్ బహుమతిని వేలం వేయడం జరిగింది.
“డీఎన్ఏ”లో అద్భుత ఆవిష్కరణ చేసిన జేమ్స్ వాట్సన్ కన్నుమూత
















Leave a Reply