హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : జమ్మూకశ్మీర్లో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన ఓ కీలక ఆపరేషన్లో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు అడ్డాగా మారింద న్న పక్కా సమాచారంతో భద్రతా ఏజెన్సీలు ఈ కఠిన చర్య తీసుకున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్ నబీ గతంలో ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు, కశ్మీర్ లోయ లో ఉగ్రవాద నెట్వర్క్ను నడుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి ఇంటిని ఉగ్రవాదు లు ఆశ్రయం కోసం, ఆయుధాలు దాచేం దుకు ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ కోసం ముందుగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం, నియంత్రిత పేలుడు పదార్థాలను ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కశ్మీర్లోని ఉగ్రవాద శ్రేణులకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న వారికి ఇకపై స్థానం లేదని స్పష్టం చేసేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కూల్చివేత అనంతరం పుల్వామా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు.
ఢిల్లీ బాంబు సూత్రధారి ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రత బలగాలు
















Leave a Reply