తణుకు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : కవిత్వం మనసుని రజింపజేస్తుందనీ, కవులు కవిత్వ రచనతో బాటు హాస్య చతురత కలిగి ఉంటారని ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. సభకు మానవత సంస్థ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గమిని రాంబాబు అధ్యక్షత వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి, ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బెజవాడ రామ సూర్యారావు, దూలం చిట్టి పాప, ప్రముఖ సినీ గేయ రచయిత రాజరాజు, గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు ప్రభృతులు వేదికను అలంకరించారు. ముందుగా వావిలాల సరళాదేవి కవులకు కండువాలు బహూకరించి స్వాగతం పలికారు. కవి సమ్మేళనంలో కవులు రసరాజు, శ్రీమతి వావిలాల సరళాదేవి, కవిశ్రీ మోహన ప్రసాద్, కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె), పప్పొప్పు విజయలక్ష్మి, వి.ఎస్.వి.ప్రసాద్, జవ్వాది లక్ష్మి, ఎస్.హైమవతీ సత్య ప్రభృతులు తమ కవితా గానంతో సభికులను అలరించారు. ప్రముఖ సినీ గేయ రచయిత రాజరాజు “అసెంబ్లీ రౌడి” సినిమా కోసం రచించగా, ప్రముఖ గాయకులు జేసుదాస్ గానం చేసిన “అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె” గీతంను ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజు తమ మధురమైన గాత్రంతో పాడి సభికులను అలరించారు. కార్యక్రమంలో చివరిగా గమిని రాంబాబు, జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, రసరాజు లను దుశ్శాలువాలు, పూల మొక్కలతోనూ, కవులు కవిశ్రీ మోహన ప్రసాద్, సితారె, గాయకుడు ఆకుమర్తి రాజు, పప్పొప్పు విజయలక్ష్మి, వి.ఎస్.వి.ప్రసాద్, శ్రీమతి జవ్వాది లక్ష్మి, ఎస్.హైమవతీ సత్య, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ ప్రభృతులను పూల మొక్కలతో వావిలాల సరళాదేవి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ గుత్తికొండ కృష్ణారావు భార్య గుత్తికొండ స్రవంతి, లైబ్రరీ రికార్డ్ అసిస్టెంట్ రాగాల పృథ్వీ నారాయణ, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, తణుకు మానవత కో ఛైర్మన్ బి.రామ కాశి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు యం.ఉమా జ్యోతి, ఎస్.వి.సతీష్ బాబు, జి.సాయి నాగేష్, జి.యం.గోవిందరావు ప్రభృతులు, చదువరులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు దూలం చిట్టి పాప వందన సమర్పణతో నాటి కార్యక్రమం ముగిసింది.
తణుకు శాఖా గ్రంథాలయంలో మనోరంజకంగా కవి సమ్మేళనం
















Leave a Reply