తాళ్లరేవు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : కార్తీక మాసం సందర్భంగా ఈనెల 16వ తేదీన తాళ్ళరేవు తెలగా అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25వ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించుచున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు నామన వి.ఎస్ సూర్యప్రసాద్, బండారు శ్రీనివాసరావులు తెలిపారు. స్థానిక 216 జాతీయ రహదారి (బైపాస్) ప్రక్కన గల గుండా బత్తుల శివరామమూర్తి స్థలంలో వనసమరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, తరువాత చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించుచున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గత 24 సంవత్సరాల నుంచి సహకరిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా కాపు సోదరులందరూ తమ కుటుంబ సమేతంగా హాజరు కావాలని సంఘ ఉపాధ్యక్షుడు కాట్నం నారాయణ మూర్తి, ఉప కార్యదర్శులు తొగరు శివరాం, ఆకుల సతీష్, కోశాధికారి ధూళిపూడి ఫణి కుమార్ కోరారు.
తాళ్ళరేవులో కాపు కార్తీక వన సమారాధనకు ఆహ్వానం
















Leave a Reply