– ఎంపీ హరీష్ కు కితాబు ఇచ్చిన సిఎం చంద్రబాబు
అమలాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో భేష్ అంటూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబు ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ముందస్తు చర్యలకు అధికారులను సమన్వయం చేయడం, అలాగే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తీర ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యేలతో కలసి గ్రామస్తులకు సూచించడంలో చురుగ్గా వ్యవహరించడంలో హరీష్ ముందున్నారు. అలాగే తుఫాన్ తీరం దాటే సమయంలో మంగళవారం అర్ధరాత్రి వేళ అంతర్వేది పునరావాసానికి చేరుకుని, అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీ హరీష్ ను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందజేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.
















Leave a Reply