Advertisement

తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం

పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడంలో తెదేపా ముందుంటుంది

పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచన

కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో కొత్తపేట బండారు బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో మండల, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, గ్రామ మరియు బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనల ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత మండల, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, గ్రామ మరియు బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపు ఇస్తుంది. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం, సైనికులు అని పేర్కొన్నారు. పదవులు పొందిన వారు అలంకారప్రాయంగా కాకుండా, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి సూచించిన అభ్యర్థుల విజయం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు నడవాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అనంతరం భోజన కార్యక్రమం నిర్వహించగా, స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నాయకులు, కార్యకర్తలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్, అలాగే నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *