Advertisement

నవ జనార్ధన స్వామిని దర్శించుకున్న అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రాజు దంపతులు

ఆలమూరు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 05 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత నవ జనార్ధన స్వామి ఆలయానికి అయినవిల్లి, అప్పన్నపల్లి ఆలయాల దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు, హైమా పార్వతి దంపతులు బుధవారం విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రాజు దంపతులు దర్శనానికి రావడంతో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఆలయ అర్చకులు ఖండవల్లి ప్రభాకరాచార్యులు, అంగర భగవాన్ ఆచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు బొబ్బా రాంబాబు, చిన్నం సుబ్బలక్ష్మి, డి.విజయలక్ష్మి, అయినవిల్లి శ్రీనివాస్, తారా దుర్గా భవాని, కట్ట శ్రీనివాస్, కొప్పాడి జైబాబు, సబ్బవరపు రావమ్మా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *