తణుకు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు చుండ్రు ప్రకాష్
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : టిడిపి బలోపేతని ప్రతి కార్యకర్త కృషి చేయాలని మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్, తణుకు నియోజకవర్గం టిడిపి పరిశీలకులు చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. తణుకు పట్టణంలో తణుకు ఎమ్మెల్యే ఆరుమీల్లి రాధాకృష్ణ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్, టిడిపి జోనల్ కో-ఆర్డినేటర్ మందవరపు రవి, పశ్చిమగోదావరి జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు రామరాజు, తణుకు నియోజకవర్గ టిడిపి పరిశీలకులు, మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుండ్రు శ్రీ వర ప్రకాష్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన ప్రతి కార్యకర్తను, నాయకులను పార్టీ గుర్తు పెట్టుకుంటుందని తెలియజేశారు.
















Leave a Reply