Advertisement

పిఎసిఎస్ చైర్మన్ వీరకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్థానిక నేతలు

తాళ్ళరేవు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : తాళ్ళరేవు పిఎసిఎస్ ఛైర్మన్ వివివి ఆదినారాయణ (వీర)కు స్థానిక నేతలు వారి కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా కేక్ కటింగ్ చేయించారు. తరువాత వారిని దుశ్శాలువాతో సత్కరించారు. తదుపరి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పూర్వపు ఏఎంసీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వర్ రావు (బూరిబాబు), జనసేన మండల కార్యదర్శి అత్తిలి వీరవెంకట సత్యనారాయణమూర్తి (బాబురావు)మరియు బండారు దొరబాబు, ఎలిపే నాగేశ్వరరావు మాస్టర్, సాంబ, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎసిఎస్ ఛైర్మన్ వీర తనని సన్మానించిన నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *