– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు
ఆత్మకూర్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 11 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీటింగ్ హాల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆత్మకూర్ (ఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీటింగ్ హాల్ లేకపోవడంతో బయట చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ కేటాయించి మీటింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రోగులు తాగటానికి కనీసం మంచినీళ్లు లేవన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కుక్కకాటు మందు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కుక్క కాటు మందు రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య ఆరు నుండి 50కి పెంచాలన్నారు. ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే జనరేటర్ సౌకర్యం కల్పించాలన్నారు. మందుల కొరతను నివారించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అటెండర్ ల సంఖ్యను పెంచాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ యాతాకుల వెంకన్న, రైతు సంఘం మండల నాయకులు యాతాకుల మల్లయ్య, డివైఎఫ్ఐ మండల నాయకులు ములకలపల్లి మహేందర్, బొడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply