కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారు. కాకినాడలోని 44వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన మట్టా శివకృష్ణ కుటుంబ సభ్యులును గురువారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం వారికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 306 మందికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) మాట్లాడుతూ అండగా వుంటానని, ఎలాంటి కష్టం ఉన్నా తమంతా ఉన్నామని, అధైర్య పడవద్దని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పొన్నాడ నాగేశ్వరరావు, జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత, మట్టపర్తి మోహన కుమారి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
మట్టా శివకృష్ణ కుటుంబానికి అండగా ఎంజీఆర్
















Leave a Reply