మానవత్వాన్ని చాటుకున్న పుడమి ఫౌండేషన్
నారాయణపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : నారాయణపేట జిల్లా కచ్వార్ టోల్ గేట్ దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తి చాలా రోజుల నుండి అక్కడే ఉంటూ కనిపించడం జరిగింది. ఆ వ్యక్తి జుట్టు పెరిగిపోవడంతో పాటు సరైన బట్టలు లేకపోవడం, అశుభ్రంగా ఉండడం చూసి పుడమి ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో ఆ వ్యక్తిని శుభ్రపరచి కొత్త బట్టలు తొడిగించడం జరిగింది. ఈ వ్యక్తిని హైదరాబాదులోని ఆశ్రమాలలో చేర్పిద్దామని ప్రయత్నం చేసినప్పటికీ వారిని సంప్రదించగా ఆశ్రమాలన్నీ ఎక్కువ సంఖ్యలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసింది. కావున ఆశ్రమాలలో చేర్పించలేకపోయామన్నారు. పుడమి ఫౌండేషన్ తమ శక్తి మేరకు మానవ సేవలో ఉంటామని తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి వారి పట్ల ఉదార భావంతో వ్యవహరించి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పుడమి ఫౌండేషన్ ఛైర్మన్ జె.వెంకటపతి రాజు, సభ్యులు యం.వెంకటేష్ బాబు, కె.సురేష్, కె.లక్ష్మణ్, జె.నాగరాజు, జె.రమేష్, జె.తరుణ్, కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply