- మ్యూనిచ్, ఓస్లో సిటీల్లో జరిగిన “మీట్ అండ్ గ్రీట్”లో ఎమ్మెల్సీ కె.నాగబాబు
యూరప్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : యూరోపియన్ దేశాల్లో స్థిరపడిన జన సైనికులు జనసేనకు అందిస్తోన్న సేవలు అభినందనీయమని, సమాజం పట్ల జన సైనికులకు ఉన్న బాధ్యత, అంకిత భావం చాలా గొప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు కె.నాగబాబు స్పష్టం చేశారు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా నాగబాబు జర్మనీలోని మ్యూనిచ్, ఓస్లో సిటీల్లో జరిగిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు. యూరోపియన్ దేశాల్లో స్థిరపడిన అనేక మంది జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా జనసైనికులను కలిసి కాసేపు మాట్లాడితే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకొని జన సైనికులను కలవడం, జన సైనికులతో పార్టీ కార్యక్రమాలను గురించి పరస్పరం చర్చించడం ఆనందంగా ఉన్నదని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్.ఆర్.ఐ. జనసైనికులు సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చి సేవలందించిన సందర్భం చాలా అభినందనీయమని అన్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల మా కర్తవ్యాన్ని తెలియజేయమని జర్మనీ జన సైనికులు నాగబాబుని కోరగా.. ఉన్నత చదువులు అభ్యసించి, సామర్ధ్యాలను పెంపొందించుకుని అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డ ఎన్.ఆర్.ఐ. జన సైనికులు జనసేన కార్యకర్తలకు జీవిత లక్ష్యాల గురించి, వారి ఎదుగుదల గురించి ప్రేరణ కలిగే విధంగా ప్రోత్సహించాలని తెలియజేశారు.
మీ ప్రతిభను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొని కార్యకర్తలను ఉత్తేజితులను చేయాలని తెలిపారు. సుపరిపాలన చూడాలంటే ప్రజలకు నాయకులకు మధ్య ఉండాల్సిన అవగాహన బాధ్యతలు, కర్తవ్యాలు, హక్కుల గురించి వివరించే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సుపరిపాలన అంశాలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన, ఆయన మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి వివరించండి. రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కొందరికి ఉండొచ్చు, మరికొందరికి ఉండక పోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ రాజకీయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, రాజకీయాలు నచ్చవు, మాకు కుదరదు అనేవారి కారణంగా నష్టం జరుగుతోందని, రాజకీయ నాయకుల వ్యవహారశైలి పరీక్షించి వారిలోని లోపాలను, నైపుణ్యతను ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్.ఆర్.ఐ. ముఖ్య నాయకులు వెంకీ పుషడపు, వైపనస రామకృష్ణ, సురేష్ వరికూటి, శివప్రసాద్ మత్త్రి, భరత్, వెంట్రప్రగడ, ప్రసాద్ ఉరుబండి, మధు నిట్టూరి, లోకేష్ పెద్దిరెడ్డి, చైతన్యసాయి తోట, దిలీప్ సాయి మండేల, మాధురి త్రిపురాణ, సునీల్ కోవెలకరు, రాజా చిక్కాల, సాయిపవన్ దాసి, పురుషోత్తం పూషాడపు, సుబ్రహ్మణ్యం యర్రపోతు, రాజు గరగ, ప్రతాప్ రేపల్లె, ఉదయ్ కాట్రెడ్డి, శంకర్ సిద్ధం, జగదీష్ కుర్లీ, వెంకటపతి తరిగోపుల, అప్పలనాయుడు, వెంకట్ కొండవీటి, నవీన్ కుమార్ బైరీ తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply