వాట్సాప్ ఛాట్‌లో వెలుగులోకి సంచలన విషయాలు
విశాఖపట్నం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : ఇద్దరు మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న సాయితేజ అనే 21 ఏళ్ల యువకుడు విశాఖలోని ఒక డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం ఉదయం సాయితేజ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న సాయితేజను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే సాయితేజ మృతికి ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కాలేజ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సాయితేజకు, మహిళా లెక్చరర్‌కి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌నూ బయటపెట్టారు. మహిళా అధ్యాపకురాలి వేధింపులే సాయితేజ అత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు.
















Leave a Reply