ఉమ్మడి మెదక్ జిల్లా, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో అదే మండలానికి చెందిన కూరకుల నందకిషోర్ పైవీధి కుక్కల దాడి చేశాయి. అలాగే మరో ముగ్గురిపై వీధి కుక్కలు కరవడం జరిగింది. స్థానికులు విధి కుక్కలను తరిమికొట్టారు. నందకిషోర్ తో పాటు ముగ్గురిని వీధి కుక్క కరిచినట్లు స్థానికులు తెలిపారు. కూరాకుల నందకిషోర్ ఎస్.బి.ఐ బ్యాంక్ పక్కన ఉన్న తన స్నేహితుడి వద్ద నోటుబుక్స్ తీసుకొని వస్తుండగా కుక్క దాడి చేసి గాయపరిచింది. అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
వీధి కుక్క దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు
















Leave a Reply