మంగళగిరి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 10 : మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధులు ప్రస్తుత చలి వాతావరణ కారణంగా రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపిఎంఎస్ఐడిసి) ఛైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సత్వరమే స్పందించారు. వృద్ధుల అవసరాన్ని గుర్తించి, వారికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ వృద్ధులకు చలి నుండి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తినప్పుడు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేసిన చిల్లపల్లి శ్రీనివాసరావు
















Leave a Reply