Advertisement

వైసీపీ నేత వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి పుట్టినరోజు వేడుకలు

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : వైసీపీ నేత వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం పట్టణంలో వైభవంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు ఆద్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మండపేట పట్టణంలో వైసిపి సీనియర్ నాయకుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అద్యక్షుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా మండపేట ప్రాథమిక వైద్య హాస్పిటల్ గర్భిణి స్త్రీలకి, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ కౌన్సిలర్లు, మండపేట వైసిపి ప్రెసిడెంట్, 29వ వార్డ్ పిల్లి శ్రీనివాస్, మండపేట నియోజకవర్గం వైసీపీ ఆర్టిఐ యాక్ట్ అధ్యక్షుడు, ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మండపేట నియోజవర్గం వైసిపి సోషల్ మీడియా అధ్యక్షుడు జొన్నపల్లి సత్తిబాబు, రాష్ట్ర వైసీపీ కార్మిక శాఖ సెక్రెటరీ శెట్టి నాగేశ్వరావు, 10వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కొల్లి వరలక్ష్మి, 8వ వార్డు వైసిపి ఉపాధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, 28వ వార్డు వైసిపి ఇన్ ఛార్జ్ మొండి మురళి, తమ్మ శ్రీనివాస్ రమణ, గుడిమెట్ల శ్రీనివాస్ అందనపల్లి రవి, మట్టపర్తి గనిరాజులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *