Advertisement

సత్యనారాయణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టీలు తోపుడు బండి వితరణ

తాళ్లరేవు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : గాడిమొగ పంచాయితీ గోపాలపురం వాస్తవ్యుడు దడాల సత్యనారాయణ అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సత్యనారాయణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టీలు తోపుడు బండిని అందజేశారు. సత్యనారాయణ 2015లో యాక్సిడెంట్ కారణంగా
అంగవైకల్యుడు అయ్యాడు. ఈయనకు ఆరోగ్యం కొరకు రిలయన్స్ మందులు మరియు కొంత ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. ఈయన ఏ రకమైన పనులు చేసుకోలేక.. స్థానికంగా ఉన్న పాఠశాల వద్ద చాక్లెట్లు, బిస్కెట్లు వంటి చిన్న చిన్న తినుబండారాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. ఇది గమనించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ ప్రతినిధి పి.సుబ్రహ్మణ్యం ఈయనకు స్టీల్ తోపుడు బండి అందజేశారు. దీనివలన ఈయనకు జీవనోపాధి మెరుగుపడుతుందని ఉద్దేశంతో బండి ఇచ్చామని సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.యు.ఎస్.కె ఈశ్వరి, కాంట్రాక్టర్ నల్లి బాలకృష్ణ, దడాల శ్రీనివాస్, నల్లి గంగాధర్ రావు, ఆశా వర్కర్లు, మోర్త దుర్గాభవాని, కొప్పాడ ముల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. బండి ఇచ్చిన రిలయన్స్ సిఎస్ఆర్ ప్రతినిధి పి.సుబ్రహ్మణ్యంకు దడాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *