పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకొని సేవా సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు వానపల్లి నాగేశ్వరరావు హరిత దంపతుల సహకారంతో సేవా సంఘం అధ్యక్షుడు విజయ జనార్ధన ఆచార్యులు, కాకినాడ మహిళా ప్రెసిడెంట్ పెద్దింటి జయశ్రీ చేతుల మీదుగా పిఠాపురం గొల్లపేట అంగన్వాడి మరియు రథాలపేట అంగన్వాడీ 1లలో పలు కార్యక్రమాలు చేశారు. బాల బాలికలకు వారి చేత కేక్ కట్ చేయించి, వారికి పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్సిల్స్, చాక్ పీసులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఆశీర్వదించిన దాతలకు సేవా సంఘం అధ్యక్షుడి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల టీచర్లు కనక లక్ష్మి, సిపిడిఓ దుర్గాదేవి, సేవా సంఘం సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి
















Leave a Reply