యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల – ఏ మిస్టిక్ వరల్డ్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయగా, రానా దగ్గుబాటి కూడా చిత్రబృందానికి ఫోన్ చేసి అభినందించారు. “చిన్న సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్తేనే ఇండస్ట్రీ బలపడుతుంది” అని ఆది తెలిపారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రాబోతోంది.
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో ఆది సాయికుమార్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. 2011లో “ప్రేమ కావాలి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది ఆ తరువాత లవ్‌లీ, సుకుమారుడు, బుర్రకథ, టాప్‌గేర్, సీఎస్ఐ సనాతన్, షణ్ముఖ వంటి చిత్రాలతో తన నటనలోని కొత్త కోణం చూపించారు. కొత్త దర్శకులు, కొత్త కాన్సెప్ట్‌లతో ఎల్లప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందుండే ఆది సాయికుమార్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది హీరోగా మిస్టరీ, సస్పెన్స్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ “శంబాల – ఏ మిస్టిక్ వరల్డ్ ( Shambala: A Mystic World )” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు ముగిశాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
















Leave a Reply