- ప్రాపర్టీ & ఆటోమోబైల్ కొనుగోలుకు బ్యాంకులచే 90% లోన్ సౌకర్యం. సినిమా వారికి రూ.2000ల విలువైన వి.వి.ఐ.పి గోల్డెన్ పాస్ ఉచితం
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 07 : ప్రముఖ బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ సినీ పరిశ్రమలోని వారి కోసం ప్రత్యేకంగా సినెటేరియా సెలెబ్రిటీ లగ్జరీ షో నిర్వహిస్తోంది. ఇందులో లగ్జరీ అపార్ట్మెంట్స్, లగ్జరీ కార్స్ & బైక్స్, గోల్డ్ & డైమండ్ నగలు, డిజైనర్ కాస్ట్యూమ్స్, ప్రఖ్యాతిగాంచిన పట్టువస్త్రాలు, గృహోపకరణాలు, లగ్జరీ కిచెన్ సామాగ్రి, లగ్జరీ ఫర్నిచర్ తదితరాలను ఈ “సెలెబ్రిటీ లగ్జరీ షో”లో ప్రదర్శించనున్నట్లు సినెటేరియా తెలియజేసింది. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎడిటర్లు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, రచయితలు, టెక్నీషియన్లు మరియు సినిమా రంగానికి చెందిన ఇతరులు పాల్గోవచ్చు. సినెటేరియా మీడియా వర్క్స్ నిర్వహిస్తున్న ఈ “సినెటేరియా సెలెబ్రిటీ లగ్జరీ షో”లో పాల్గొంటున్న కొన్ని బ్యాంకులు రియల్ ఎస్టేట్ & ఆటోమోబైల్ కొనుగోలుకు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు మరియు ఇతర టెక్నీషియన్లకు బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా 90 శాతం వరకు లోన్ సౌకర్యం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. సెలెబ్రిటీలు మరియు సోషల్ మీడియా స్టార్లకు స్పాట్ లోన్ లభించే అవకాశం ఉంది. డిసెంబర్ 27, 28వ తేదీలలో జూబిలీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించబడుతున్న ఈ “సెలెబ్రిటీ లగ్జరీ షో”కు కేవలం ముందస్తు ఆహ్వానం లేదా ముందస్తు రిజిస్ట్రేషన్, లేదా గెస్ట్ పాస్/వి.ఐ.పి. పాస్/ వి.వి.ఐ.పి పాస్ లు ఉన్నవారు మాత్రమే పాల్గోవచ్చు. రూ.2000/- విలువైన ఈ పాస్ సినీ పరిశ్రమ వారికి మాత్రం ఉచితంగా లభిస్తుంది. అయితే వారు ఏ రంగంలో కొనసాగుతోంది, ఏ అసోసియేషన్ లో లేదా ఏ సినిమాకు పని చేస్తోందీ తెలియజేయాలి. గెస్ట్ పాస్/ వి.ఐ.పి. పాస్/ వి.వి.ఐ.పి పాస్ ల కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారు వాట్స్ అప్ నెంబర్ 8712217555 ద్వారా తమ పేర్లు మరియు వివరాలు పంపించవచ్చు. లేదా www.allevents.com / www.cinetaria.in వెబ్ సైట్స్ ద్వారా ఆన్ లైన్ లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. సెలెబ్రిటీలు మరియు వి.వి.ఐ.పిల పేరు నమోదు కోసం 8712217555 నంబరుకు వాట్సాప్ ద్వారా తమ పేరు వివరాలు తెలియజేస్తే సరిపోతుంది.













Leave a Reply