Advertisement

మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం – ఉడార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

 హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జూన్ 14 : మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం అని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఉడార్ట్) ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఆదివారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కు వద్ద నిర్వహించిన 5కె రన్ ను ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక 30 నిమిషాలు నడక తప్పనిసరిగా నడవాలని, నడక ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, రోజులో కొంత సమయం తమ తమ ఆరోగ్యం కాపాడు కోవడానికి యోగ, ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మానసిక ఆనందం కలుగుతుందన్నారు. దేహమే దేవాలయం అని అని ప్రతి ఒక్కరూ జీవించాలని ఆయా కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ జీవితంలో ప్రతీ సంవత్సరం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వాటి ద్వారా చక్కని ఆక్సీజన్ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ సర్టిఫికెట్, మెడల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా చేతుల మీదుగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *