Advertisement

కవితా రచనలో విజేతగా కొండూరు

గూడూరు, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : ఐఎస్ఓ గుర్తింపు కలిగిన సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళా వేదిక వారు దగ్గరైన దూరాలు (బంధాలు – బంధుత్వాలు) అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి విందూరు జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత కొండూరు వెంకటేశ్వరరాజు విజేతగా నిలిచాడు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ కవితల పోటీలో “పల్లవించాలి అనుబంధాల రాగమాలిక” అనే శీర్షికతో ఆయన రచించిన కవిత న్యాయ నిర్ణేతల పరిశీలనలో టాప్ ఇరవై ఉత్తమ రచనల్లో ఒకటిగా ఎంపికైంది. ఇందుకు సంబంధించి అభినందనలతో శ్రీశ్రీ కళా వేదిక కార్యవర్గం పంపిన దృవపత్రాన్ని వెఃకటేశ్వరరాజు అంతర్జాలం ద్వారా సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వెంకటేశ్వరరాజును అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *