- రాయల సీమ అక్షర పరిమళం
- చిత్రపరిశ్రమకు మణిహారం
- 16 రోజుల పండగే
హైదరాబాద్, సింహగర్జన, జనవరి 06 : రతనాల సీమ రాయలసీమ పల్లె ప్రాంతమైన మంగళంపేట గడ్డపై శ్రీమతి రాధా రుక్మిణి, రమణయ్య దంపతుల అల్లారు, అల్లరి సంతానమే ప్రముఖ చిత్ర దర్శకులు అడవి సాయి కిరణ్ గారు మెచ్చిన ,మెప్పించిన మాటల రచయిత పొక్కళ్ల సోమశేఖర్. సింహగర్జన పత్రిక సోమవారం ప్రముఖ సంగీత దర్శకులు అనుపృబెన్స్ వారి స్టూడియోలో నిర్వహించిన ఇంటర్వ్యూలో వారి మాటల్లో ఇలా… మనిషన్న వాడు అనుకున్నది సాధించాలి అంటే మిత్రుని మాటల కన్నా శత్రువు మాటల ద్వారానే కసిగా మార్గాన్ని గమ్యాన్ని నిర్దేశించుకోవచ్చని… ఎదుటి వ్యక్తి శక్తిని యుక్తిగా పసిగట్టి పనిపట్టి ఇసుక నుండి తైలం తీయగల మేధావి అయిన దర్శకులు అడవి సాయి కిరణ్ గారి చెంతకు తాను చేరడం వారి ఆదరణ తీయని అనుభూతిని నిత్యం పంచుతుందన్నారు.

తన కుటుంబ నేపథ్యాన్ని, తన తండ్రి ప్రధాన ఉపాధ్యాయునిగా తనకు చిరు ప్రాయంలో నేర్పిన అక్షర మాలికలు, క్రమశిక్షణ, పల్లె జీవితాలను, సంతోషాలను కష్టాలను, ప్రస్తుత మనిషి మనుగడను ఏమర పాటుగా కూడా మరచి పోకుండా సామాజిక స్పృహతో అనుకున్నది సాధించాలనే తపనతో ముందుకు సాగే తత్వమున్న సోమశేఖర్ విద్య పై తనకున్న, తన మదిలో దాగిన సూచనను లఘు చిత్రంగా చిత్రీకరించి మనుషుల మట్టి బుర్రల పై నీటిని చల్లి, చిన్న బడులు ఒక్కటి చేసి పెద్ద బడుల్లో ఉపాధ్యాయులను అందరిని ఒకచోట చేర్చి విద్య నేర్పాలని ప్రభుత్వానికి విలువైన సందేశాని ఇచ్చిన ఘనులు.
తాను గేమింగ్ మేధమెటీషియన్ గా పని చేస్తున్నా , తన భార్య ఐ టి ఉద్యోగి అయినా, సాఫీగా జీవితం సాగి పోతున్నా, ఇంకా ఏదో తెలియని అసంతృప్తి ఉండేదని, సాయి కిరణ్ గారి పరిచయం తరువాత నాలో దాగిన మరో కోణాన్ని వారు ఆవిష్కరించడం తెలియని అనుభూతిని పంచిందన్నారు. తొలి పరిచయం “16 రోజుల పండుగ” అవుతుందని, తనపై దర్శకులకు నమ్మకాన్ని పెంచుతుందని, నన్ను మాటల రచయితగా, నటునిగా మారుస్తుందని తాను ఊహించలేదని, మనిషి మనిషిలా బయట లోపల ఒకేలా బతకాలని నవ్వులు పంచుతూ, ఇంటర్వ్యూలో నవ్వులు పువ్వులు పూయించిన పొక్కళ్ల సోమశేఖర్ తెలుగు కళామతల్లి వడిలో మాటల మాంత్రికునిగా, నటునిగా ప్రముఖుల చెంతన చేరి చలన చిత్ర సీమలో విరాజిల్లాలని మనసారా కోరుకుందాం..
- బత్తుల ప్రకాష్ బాబు, సబ్ ఎడిటర్, సింహగర్జన













Leave a Reply