Advertisement

భవిష్య వాణి

ప్రస్తుతం వైభవాలు ఎన్నున్నా భవిష్యత్తు ప్రశ్నార్థకమే…ఆలోచన సడలి గమ్మత్తుగానున్న తీసుకున్న నిర్ణయం ఓసారి తప్పేలే…వికసించిన పుష్పాలు అతివ కురులలోక భగవానుని పాదాల చెంతకాదరిచేరే వరకు చిక్కులేలే…ఈ జీవితం అంతుచిక్కని ప్రశ్నేలే అడుగడుగునా గండాలే ఆశలన్నీ వింతేలే….కొన్నిసార్లు కొందరి మాటలే దారి చూపిస్తాయి, మరికొన్నిసార్లు చేసిన తప్పులే దారి వేస్తాయి, ఇంకొన్నిసార్లు వచ్చిన అనుభవాలే బ్రతుకు సడలిని మారుస్తాయి, ఈ కోవలోకే చెందుతాయి ముక్కా శ్రీనివాస్ గారి అక్షరాలు, పడినా లేవమని, తగిలిన గాయాన్ని తుడుచుకుని ముందుకు పోమని, బాధపడుతూ అక్కడే కూర్చోకు సాధించేది ముందుంది నడవమని చెప్పకనే చెబుతూ మానవ జీవన విధానానికి కొత్త పునాదులు వేస్తాయి, భారమైన బ్రతుకుకి భరోసానిస్తాయి.

  • ఇక కవిత్వం విషయానికి వస్తే…
  • శీర్షిక : తెలివితో సాగిపో

పాతకథకు కొత్తతెలివి భలేకుదిరిందిలే,తెలివితో తాపాల దాహం తీర్చుకోవచ్చులే.గమనించడం నేర్చుకుంటే గమ్యపు దారులు తేలికవ్వునులే,ప్రయత్నానికి బద్దకిస్తే జ్ఞానం వికసించిదులే,మారుతున్న కాలంతో మనము మారి వృద్ధిపథంలో సాగాలిలే,సమయ స్పూర్తితో వ్యవహారిస్తూ వెంటాడే బాధలను భాగ్యాలుగా మలుచుకోవాలిలే.లోకం కీర్తించినా ప్రశ్నించినా శోధనలను వీడొద్దులే,పరిగెత్తే కాలంలో కలతల ఒడిలో నిదురపోవడం తప్పేలే,పాఠాలు నేర్పేటి జీవితం నీ పాఠమే పఠియించాలిలే,అహంకారం వీడి లోకహితం కోరి అవరోధాలను అలజడులను అవకాశాలుగా మలుచుకుంటే దివ్యలోక కాంతి నీలోనే కనిపించునులే.

రచయిత : ముక్కా శ్రీనివాస్

  • సమీక్ష

పాత కథలకు కొత్త తెలివి భలే కుదిరిందట, తెలివితో తాపాల దాహం తీర్చుకోవచ్చట…కాస్త గమనించడం నేర్చుకుంటే గమ్యపు దారులు తేలికవుతాయట, బద్ధకం వదిలేసి ప్రయత్నిస్తే జ్ఞానం వికసిస్తుందట, మారుతున్న కాలంతో పాటు మనము వృద్ధిపథంలో సాగాలట, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ వెంటాడే బాధలను భాగ్యాలుగా మలచుకోవాలట..ఎంతటి దృక్కోణమో కదా ఎంతటి దూరపు చూపో రచయితకు వాస్తవాలను ముందుగానే గ్రహించి జాగ్రత్త పడమని, కన్నీటిని కనక భాగ్యాలుగా మార్చుకోమని సునాయాసంగా చెప్తున్నారు…లోకం కీర్తించినా, ప్రశ్నించినాశోధనలను వీడొద్దని, పరిగెత్తే కాలంలో కలతల ఒడిలో నిదురపోతే జీవిత పాఠాలు నేర్చుకోవడం కష్టమేనని, అహంకారం వీడి లోకహితం కోసం అవరోధాలను, అలజడులను అవకాశాలుగా మార్చుకుంటే దివ్యలోక కాంతి నీలోనే కనిపిస్తుందని ఎంతో ఉన్నతమైన అర్ధాన్ని చేకూర్చి గొప్ప ఉపదేశం అందించారు రచయిత…పాఠకుల మనసుకు కాస్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తూ, అబద్ధపు పుటలను అణువణువు ఛిద్రం చేసి, నిజమనే సత్యాన్ని గ్రహించమని, బాధలు శాశ్వతం కావని అన్నిటినీ విడిచి ఉన్నతమైన కీర్తిని ఘనించాలని, జీవిత పాఠాలు నేర్చుకుంటూ, లోకహితాన్ని అవపోసన పట్టాలని, ఆటంకాలను ఎదురీది జీవితంలో కాంతిని ప్రజ్వలిల్లేలా చేసుకోవాలని ఎంతో ఉదారంగా చెప్పారు రచయిత, ఇలాంటి మరెన్నో ప్రేరణాత్మకమైన రచనలు మీ కలం నుంచి పుట్టాలని, మీ అక్షరాలు ఎందరో జీవితాలకు రక్షణగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • సమీక్ష : భాను తేజశ్రీ పోలగాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *