Advertisement

గుండె గదిలోని కొన్ని భావాలు

అద్భుతమైన భావాల నిధికరగని వసంతాల పెన్నిధి అలలా విజృంభించే ఆశల నదివెచ్చని ఊసులను చేరవేసే వారధి వేవేల భావాలను నిక్షిప్తంగా దాచిన గుండె గది ఈ కవిత్వం కనుమరుగే అవ్వని కమనీయ తత్వం కన్నె మనసున ఊయలలూగే భావ కవిత్వం….

కొన్ని భావాలు, కొన్ని ఆచరణలు కొన్ని కట్టుబాట్లు, కొన్ని చెరపలేని క్షణాలు, ఎన్నో ఆశలను ఎన్నో ఆశయాలను, చెప్పలేక దాచిన అనుభూతులను, దాచి చెప్పాలని ఆరాటపడే మనసును ఉరకలెత్తిస్తూ, ఎంతో ఉల్లాసంగా దాచుకునేది మనిషి గుండె గది…కొన్ని కవిత్వాలు చదివిన కొద్ది చదవాలి అనిపిస్తాయి, వినినిన కొద్ది వినసొంపుగా ఉంటాయి, అందులోనూ భావాన్ని అద్దుకున్న కవిత్వం కనులకు ఆకర్షణీయంగానే కాదు, మనసుకి ప్రేరణాత్మకంగా కూడా హత్తుకుపోతుంది అలాంటి కోవలోకే వస్తాయి యామిని గారి కవిత్వాలు.

  • ఇక కవిత్వం విషయానికి వస్తే…
  • శీర్షిక : నా కవిత

మౌనం అందమైనది

ఎన్నో జ్ఞాపకాల నిధి

మనసుని అదుపులో ఉంచుతుంది.

మదిలో మెదిలే అందమైన ఊసులు,

మనసుతెలపలేని భావాలు కనులు తెలుపుతూ,

మనసుని సమ్మోహాన పారవశ్యంలో ముంచెత్తుతూ,

హృదయమున చెరిగిపోని, చెరపలేని సంతకాలు హృదయాన్ని తాకేలా, మరువలేని పరిమళాలు హృదయమంతా నిండిన,ఎన్నో భావనలు హృదయాంతరాల్లో నిక్షిప్తమైన అనుభూతులు,

హృదిని తరచి చూచిన, ఏదో చెప్పాలని ఎన్నో ఆశలు, మనసుని అంటిపెట్టుకుని ఉన్న నాదైన భావంలో, భావకవిత్వంలో ఈదుతూ అందమైన అక్షరమణులు ఎన్నో పదాలతో కూడిన ఆణిముత్యాలకై చేసే అన్వేషణలో…

ఒక్కో అక్షరాన్ని, అల్లాలనిన అంతరంగంలో అలలా కదలాడే ఆలోచనలు, ప్రతిక్షణం అందమైన అనుభవంతో కూడిన భావాలని ప్రకృతిని ఆస్వాదిస్తూ,కొలనులో కదలాడే కలువలకదలికల్లాసరళమైన భాషా శైలిలో…

నవకవితలకై శ్రీకారము చుట్టమని ప్రేరేపించితలంపుల్లోనూ జాలువారేది నా కవిత్వం…

  • రచయిత : యామిని కోళ్ళూరు
  • సమీక్ష

మౌనం అందమైనదట మనసుని అదుపులో ఉంచుకుని ఎన్నో భావాలకు నిధిలా మారుతుందట మదిలో మెదిలే అందమైన ఊసులు, మనసు తెలుపలేని భావాలు కనులతో తెలుపుతూ మనసుని సమ్మోహన పారవశ్యంలో ముంచేస్తుందట…ఎంత అపూర్వమైన పోలికో కదా, మనసుని ఉత్తేజపరిచే అందమైన భావాలు గుండె లోతుల్లో ఎంత వేదనను అనుభవిస్తాయో అద్భుతమైన భావాన్ని చేకూర్చి వివరించారు రచయిత…

హృదయం చెరిగిపోని చెరపలేని సంతకాలను మనసుని తాకేలా చేస్తుందని, మరువలేని పరిమళాలు హృదయం అంతా నిండిన భావనలు హృదయాంత రంగాల్లో నిక్షిప్తమైన అనుభూతులను పెనవేసుకుంటాయని, హృదిని తరచి చూచినా, ఏదో చెప్పాలని ఎన్నో ఆశలు మనసుని అంటిపెట్టు కుని ఉంటాయని, తనదైన భావంతో భావ కవిత్వంలో ఈదుతూ అందమైన అక్షరమణులు ఎన్నో పదాలతో కూడిన ఆణిముత్యాలకై అన్వేషణ చేస్తాయని హృదయాన్వేషణలో భాగంగా, తోడుకై పరితపించే అక్షర భాండాగారాలు మరికొన్ని అని ఎంతో అర్థవంతంగా వివరించారు రచయిత…

ఒక్కొక్క అక్షరాన్ని అల్లాలని నా అంతరంగంలో అలలా కదలాడే ఆలోచనలు, అనుభవంతో కూడిన భావాలను ప్రకృతి ఆస్వాదిస్తూ, కొలనులో కదలాడే కలువల కదలికల్లా సరళమైన భాషా శైలిలో నవ కవితలకై శ్రీకారం చుట్టమని ప్రేరేపించి తలంపుల్లోనూ జాలువారేది కదా నా కవిత్వం అంటూ ముగించారు, నిజమే కవిత్వం కమ్మని కమనీయ కల్పతరువు, ఎన్నో వేల ఆలోచనలకు పునాది, ఎన్నో ఆశలు ఆశయాలకు దిక్సూచి, చెప్పాలనుకున్న భావాలకు ఊరట నిచ్చే వజ్రాల గని..మనిషి మనసుని ఉరకలెత్తిస్తుంది ఆశతో బ్రతకమని ఆరాటపడేలా చేస్తుంది భావనలను పైకి చూపించమని ఒక్కోసారి బెదిరిస్తుంది మొత్తానికి కవిత్వం కనుమరుగే అవ్వని అందాల జాబిలి….

ఇలాంటి మరెన్నో మనసుకి హత్తుకునే కవిత్వాలు మీరు రచించాలని, అందని చందమామను కూడా అందుకునేలా చేసే మీ అక్షర భావజాలంతో మా మనసులను ఉత్తేజ పరచాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • సమీక్ష : భాను తేజశ్రీ పోలగాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *