Advertisement

జీవనది క్యాలెండర్ ఆవిష్కరించిన డా ఉమర్ ఆలీషా

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి ముద్రింపజేసిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు 60వ పుట్టిన రోజు సంధర్భంగా హైదరాబాద్ పీఠం సభ్యులు కొంపల్లిలోని కండ్లకొయ్య గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ జీవనది ఫౌండేషన్ ద్వారా సంస్ధ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. నదీ జలలా పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి, సంస్థ సభ్యులను స్వామి అభినందించారు. ఈ సంధర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి మాట్లాడుతూ ఉమర్ ఆలీషా స్వామి ఆశీస్సులతో తమ సంస్ధ ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. అదే విధంగా దేవాలయాల పరిశుభ్రత, నదీ జలాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు తమ సంస్ధ ద్వారా జరుగుతుందన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవýప్‌మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు కూడా నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్ధ జాతీయ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *