Advertisement

రేపు ఉగాది మహా సభ

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 18 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పట్టణంలోని నూతన ఆశ్రమ ప్రాంగణంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షతన 19వ తేదీ గురువారం తెలుగు నూతన సంవత్సర ఉగాది మహా సభ నిర్వహించడం జరుగుతుందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలియజేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సభను ప్రారంభిస్తారని, సంగీత విభావరి కార్యక్రమం ద్వారా అస్థాన సంగీత కళాకారులచే కీర్తనలు ఆలపించబడటం జరుగుతుందన్నారు. తాత్విక బాల వికాస్ బాల బాలికలు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారన్నారు. ఈ మహా సభకు సుమారు 5 వేల మంది సభ్యులు, భక్తులు హాజరుకావచ్చని అంచనా వేయడం జరిగిందని, సభకు వచ్చిన వేలాది మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేయబడుతుందన్నారు. అష్టావదాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావుచే పంచాంగ శ్రవణం నిర్వహించబడటం జరుగుతుందన్నారు. సభకు వచ్చిన వేలాది మందికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. మహా మంత్రం పొంది సమాజంలో సుఖంగా, శాంతిగా, తృప్తిగా జీవించాలి అని కోరిక కల్గిన వారికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు మహా మంత్రోపదేశం చేస్తారని తెలిపారు. దివ్య హారతితో మహా సభ ముగించబడుతుందన్నారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది మహా సభలో పాల్గొని, స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, తరించ వలసినదిగా పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *