Advertisement

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న 12 జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, సినీ మరియు టీవీ నటి రాగిణి, తొలి టెలివిజన్ వ్యాఖ్యాత విజయ దుర్గ తదితరులు పిఠాపురం పట్టణానికి చెందిన జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, సినీ రచయిత, దర్శకుడు, పత్రికా సంపాదకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను యమునా నది పుష్కర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ నదీ జలాల పరిరక్షణ కోసం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మరియు సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పుష్కరాలు జరుపుకోబోతున్న పవిత్ర యమునా నదీ పేరిట పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు డా సునీల్ కుమార్ యాండ్ర కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *