హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 19 : ఉమర్అలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ,జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే యమునా నది పుష్కరాల సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ రూపొందించిన యమునా నది పుష్కరాల పోస్టర్ ను శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనది ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదులను శుభ్రపరచడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ, జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర పాల్గొన్నారు.
జీవనది ఫౌండేషన్ యమునా నది పుష్కరాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమర్ ఆలీషా













Leave a Reply