హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 24 : సినీ గేయ రచయిత అక్షయ్ కృష్ణ రచించి పాడిన “నా ముద్దుల బంగారు కొండ” పాటలో తాను హీరోగా నటించడం జరిగిందని, ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుందని ఈ పాటలో నటించిన హీరో గెడ్డం చిరంజీవి (డేని) తెలిపారు. సివిఏ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గెడ్డం మేరి నిర్మాతగా, గెడ్డం బ్రదర్స్ సహా నిర్మాతలుగా ఈ పాటను నిర్మించారు. త్వరలోనే ఈ పాట యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ పాటకు కోడి రాము పర్యవేక్షణలో కొరియోగ్రాఫర్ దొమ్మేటి శ్రీనివాస్, నటీ నటులు గెడ్డం చిరంజీవి (డేని), సంధ్య, డిఓపీ మరియు ఎడిటింగ్ ధీరజ్ ఆర్ట్స్, పోస్టర్ డిజైనింగ్ ప్రసు ఆర్ట్స్, మ్యూజిక్ స్వరాజ్ స్టూడియో, సింగర్స్ అక్షయ్ కృష్ణ, భవాని, మేనేజర్స్ శ్రీకాంత్ రెడ్డి మరియు కొడవళ్ళురి రాము (రాముజీ), పిఆర్ఓ డా సునీల్ కుమార్ యాండ్ర (స్కై రైటింగ్స్), లిరిక్స్, దర్శకత్వం అక్షయ్ కృష్ణ.
‘నా బంగారు కొండ’ పాట ప్రేక్షకులను అలరిస్తుంది : హీరో గెడ్డం చిరంజీవి













Leave a Reply